ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రవృత్తి మార్చుకోకపోతే నగర బహిష్కరణే' - నున్నలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ వార్తలు

రౌడీషీటర్లు తమ ప్రవృత్తి మార్చుకోవాలని.., లేకపోతే నగర బహిష్కరణ తప్పదని విజయవాడ నున్న పోలీసులు హెచ్చరించారు. స్టేషన్​ వద్ద వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

police councelling to rowdy sheeters in nunna vijayawada
నున్నలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్

By

Published : Jun 21, 2020, 7:43 PM IST

కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న బెజవాడలో కొద్ది రోజుల కిందట జరిగిన గ్యాంగ్ వార్ కలకలం రేపింది. 2 వర్గాలు కొట్టుకున్న ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందాడు. కరోనా నేపథ్యంలో పోలీసులు తీరిక లేకుండా ఉండటంతో రౌడీషీటర్లు మళ్లీ తమ పనులు మొదలుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు విజయవాడ శివారు నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. నేర ప్రవృత్తి మార్చుకోవాలని లేకపోతే నగర బహిష్కరణ తప్పదని సీఐ ప్రభాకర్ వారిని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details