ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గండ్రంలో పోలీసుల కార్డెన్ సెర్చ్ - Police cordon search operation in Gandram news

కృష్ణా జిల్లా గూడూరు మండలం గండ్రం గ్రామంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో తనిఖీలు చేశారు.

Police cordon search operation
పోలీసుల కార్డెన్ సెర్చ్ ఆపరేషన్

By

Published : Feb 14, 2021, 2:59 PM IST

కృష్ణా జిల్లా గూడూరు మండలం గండ్రం గ్రామంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న మచిలీపట్నం రెవెన్యూ డివిజన్​లో ముందస్తు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా 2,500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. 50 లీటర్ల నాటుసారా, దానికి ఉపయోగించే ముడి సరకు, 10 డ్రమ్ములు, బట్టీ పాత్రలు, గ్యాస్ సిలిండర్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details