ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేసరపల్లిలో పోలీసుల కార్డన్ సెర్చ్ - krishna district newsupdates

గన్నవరం మండలం కేసరపల్లి శివారు వీఎస్ కాలనీలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలువురు అనుమానితులకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చారు. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఏసీపీ విజయ్ పాల్ వెల్లడించారు.

Police cordon search in Kesarapally
కేసరపల్లిలో పోలీసుల కార్డెన్ సెర్చ్

By

Published : Jan 4, 2021, 12:27 PM IST

కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి శివారు వీఎన్​ కాలనీలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజయవాడ ఈస్ట్ ఏసీపీ విజయ్ పాల్ ఆధ్వర్యంలో సీఐ శివాజీ బృందం ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. కాలనీలో ఆకతాయిలను అదుపు చేయటంలో భాగంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

నివాసితులు, వారి వాహనాలు, వృత్తి సంబంధిత వివరాలు సేకరించారు. పలువురు అనుమానితులకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చారు. అవాంఛనీయ సంఘటనలు, నేరాలకు పాల్పడితే.. ఉపేక్షించేది లేదని ఏసీపీ విజయ్ పాల్ వెల్లడించారు.

ఇదీ చదవండి:

తన పోలీస్ గారాలపట్టికి.. పోలీస్ నాన్న సెల్యూట్!

ABOUT THE AUTHOR

...view details