ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పైశాచిక కానిస్టేబుల్..రక్షించాల్సినవాడే కడతేర్చబోయాడు

ఆపదలో ఉన్నవారికి సాయం చేయాల్సినవాడు.. తప్పు చేసినవాళ్లకు సర్దిచెప్పి సమస్యలు పరిష్కరించాల్సిన పోలీసు ఉద్యోగం చేస్తున్న వ్యక్తి.. కానీ తానే కట్టుకున్న భార్యను కడతేర్చేందుకు సిద్ధమయ్యాడు. సర్పంచ్​ అయిన తల్లి మాటలు విని భార్యను విచక్షణరహితంగా కొట్టి గాయపరిచాడు. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్న ఆమె.. ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామంలో జరిగింది.

constable harassment
భార్యపై కానిస్టేబుల్ దాడి

By

Published : Jun 12, 2021, 7:26 PM IST

భార్యపై కానిస్టేబుల్ దాడి

కృష్ణా జిల్లా వత్సవాయి పోలీస్ స్టేషన్​లో కానిస్టేబుల్​గా పని చేస్తున్న సునీల్ అనే వ్యక్తి తన భార్య నవ్యపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన నవ్యను ఆమె బంధువులు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నవ్య అక్కడే చికిత్స తీసుకుంటోంది.

వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకే..

సునీల్​కు జగ్గయ్యపేటకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందని నవ్య ఆరోపిస్తోంది. వారికి అడ్డుగా ఉన్నానని తనపై హత్యాయత్నం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన అత్త ప్రోద్బలంతోనే నాపై దాడి చేశారని తెలిపింది. మహిళను కొట్టలేకపోతున్నావా? అని సునీల్​ను రెచ్చగొట్టిందని.. ఆపై ఏమైనా నేను చూసుకుంటానని..మహిళా సర్పంచ్​ అయిన ఆమె చెప్పడంతో సునీల్ తనపై హత్యాయత్నానికి దిగాడని చెప్పింది.

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసే.. భార్యపై తీవ్రంగా దాడి చేయడాన్ని మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అతనిపై కఠిన చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

మూడేళ్ల చిన్నారిని గొంతుకోసి హత్య చేసిన మేనమామ

కొండపై నుంచి దొర్లుతూ వచ్చి..

ABOUT THE AUTHOR

...view details