ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నందిగామలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు - నందిగామలో ట్రాఫిక్ సమస్యలు వార్తలు

కృష్ణా జిల్లా నందిగామలోని వ్యాపార సంస్థల వద్ద... పార్కింగ్ చేసిన వాహనాలతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులు పార్కింగ్ స్థలాల్లో కాకుండా ఎక్కడబడితే అక్కడ పార్కింగ్ చేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

police clears traffic issue in nandigama at krishna district
నందిగామలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు

By

Published : Aug 17, 2020, 4:56 PM IST

కృష్ణా జిల్లా నందిగామలోని వ్యాపార సంస్థల వద్ద పార్కింగ్ చేసిన వాహనాలతో ట్రాఫిక్​కు ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. వ్యాపార సంస్థల ముందు ఉంచిన వాహనాలను ట్రాఫిక్​కు ఇబ్బంది లేకుండా పార్కింగ్ చేసుకోవాలని... లేదంటే ఆ సంస్థలపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వాహనదారులు సైతం... తమ వాహనాలను ఎక్కడబడితే అక్కడ పార్కింగ్ చేసినా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రజలు మాస్కులు ధరించి బయటికి రావాలని, దుకాణాల్లో భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details