ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాహన తనిఖీల్లో 6కేజీల గంజాయి పట్టివేత..యువకుడు పరారీ - ఈరోజు గన్నవరం తాజా వార్తలు

గన్నవరం విమానాశ్రయం వద్ద పోలీసుల తనిఖీల్లో భాగంగా.. యువకుడిని ఆపి వాహన పత్రాలు చూపించమని అడిగారు. బైక్ పక్కకు ఆపిన యువకుడు పరారయ్యాడు. వాహనంపై ఉన్న బ్యాగ్​ను తనిఖీ చేసిన పోలీసులు.. 6కేజీల గంజాయిని గుర్తించారు.

Cannabis smuggling on a bike
6కేజీల గంజాయి స్వాధీనం

By

Published : Mar 23, 2021, 1:19 PM IST

కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. నెంబర్ ప్లేట్ లేని బైక్​పై ఏలూరు నుంచి విజయవాడ వెళ్తున్న యువకుడిని ఆపి.. వాహన‌ పత్రాలు చూపించాలని ప్రశ్నించారు. బండి పక్కకు తీసుకెళ్లి ఆపి.. ఆ తర్వాత పారిపోయాడు. బైక్ మీద ఉన్న బ్యాగ్​ను తనిఖీ చేసిన పోలీసులు.. 6 కేజీలు గంజాయి ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details