Bit Wife Cheek: భార్య బుగ్గ కొరికి గాయపర్చిన భర్తపై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కానూరు కేసీపీ కాలనీకి చెందిన తాళ్లపూడి స్రవంతి, రాంబాబులు భార్యాభర్తలు. భర్త కాపలాదారుగా పని చేస్తుంటాడు. ఇతను మద్యానికి బానిసై భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు.
భార్య బుగ్గ కొరికిన భర్త.. కేసు నమోదు చేసిన పోలీసులు
Bit Wife Cheek: కృష్ణా జిల్లా పెనమలూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కానూరు కేసీపీ కాలనీకి చెందిన ఓ వ్యక్తి భార్యతో గొడవపడి ఆమె బుగ్గ కొరికి తీవ్రంగా గాయపరిచాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
భార్య బుగ్గకొరికిన భర్త
ఆదివారం సాయంత్రం మద్యం తాగి వచ్చి భార్యతో వివాదానికి దిగాడు. భార్య మందలించడంతో ఆగ్రహం చెందిన ఇతను ఆమెపై దాడి చేసి బుగ్గ కొరికేశాడు. చికిత్స పొందిన అనంతరం ఆమె సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. భర్త రాంబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి