కృష్ణాజిల్లా గుడివాడలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ధనియాలపేట కాలనీలో డీఎస్పీ సత్యానందం ఆధ్వర్యంలో సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో పత్రాలు సరిగా లేని 40 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలు, 2 వ్యానులు సీజ్ చేశారు. అనుమానితులు ఎవరైనా సంచరిస్తే తమకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సత్యానందం ప్రజలను కోరారు.
గుడివాడలో పోలీసుల నిర్బంధ తనిఖీలు - gudiwada carden search latest news
కృష్ణాజిల్లా గుడివాడలో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చేయడమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశమని డీఎస్పీ సత్యానందం తెలిపారు.

గుడివాడలో పోలీసుల నిర్భంద తనీఖీలు
Last Updated : Nov 3, 2019, 4:36 PM IST