నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాల్లో వాయు, శబ్ధ కాలుష్యాల మధ్య విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు.. ఇకపై కొంత ఊరట లభించనుంది. ట్రాఫిక్ పోలీసుల కోసం విజయవాడ నగరంలో నూతనంగా డిజైన్ చేసిన పోలీస్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో ఈతరహా పోలీస్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఒక వ్యక్తి పట్టే స్థలంలోనే బూతులను ఏర్పాటు చేశారు . ఇప్పుడు నూతన డిజైన్లతో రద్దీ కూడళ్లలో వీటిని అందుబాటులోకి తెస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు విధినిర్వహణలో అలసట చెందినప్పుడు.. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు పోలీస్ కేంద్రంలో ఉండి సేదతీరవచ్చని అధికారులు చెబుతున్నారు. మొత్తం నగరంలో 56 ప్రాంతాల్లో ఈ తరహా పోలీస్ బూత్ లను ఏర్పాటు చేయనున్నారు. ఏడు ప్రాంతాల్లో బూత్‌ల సైజులను మార్చాలని అధికారులు తెలిపారు. వేసవి, వర్షాకాలాల్లో ఇవీ ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు వెల్లడించారు.
సరికొత్త డిజైన్లలో పోలీస్ బూత్‌లు - Police booths set up in vijayawada news update
కాలుష్యాన్ని లెక్కచేయకుండా.. ఎండలో ఎండుతూ.. వానలో తడుస్తూ.. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాల్లో.. ప్రజల ప్రయాణాలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూసేందుకు ప్రాణాలను పనంగా పెట్టి మరీ విధులు నిర్వాహిస్తారు ట్రాఫిక్ పోలీసులు. ఇకపై వీరికి ఇలాంటి అవస్థలేవి లేకుండా చేస్తూ.. అలసట అనిపిస్తే సేద తీరేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధాన కూడల్లో పోలీస్ బూత్‌లు ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది.

సరికొత్త డిజైన్లలో పోలీస్ బూత్‌లు ఏర్పాటు