కృష్ణాజిల్లా నందిగామలోని హరిజనవాడలో కోట ఏసుబాబు అనే వ్యక్తి.. స్నేహితులతో కలిసి క్యారమ్ బోర్డు ఆడుకుంటున్నాడు. రాత్రి సమయంలో ఆటలు ఎందుకు ఆడుతున్నారని ఇద్దరు కానిస్టేబుళ్లు ఏసుబాబుపై చేయి చేసుకున్నారు. నేనేం తప్పు చేశా.. ఎందుకు కొడుతున్నారని ఏసుబాబు ప్రశ్నించగా.. మాకే ఎదురు చెప్తావా అంటూ.. లాఠీలు వీరిగిపోయేలా కొట్టినట్లు స్థానికులు తెలిపారు.
'నేనేం తప్పు చేశా.. పోలీసులు నన్నెందుకు కొట్టారు' - నందిగామలో వ్యక్తిపై కానిస్టేబుళ్ల దాడి వార్తలు
కృష్ణా జిల్లా నందిగామలో ఇద్దరు కానిస్టేబుళ్లు ఓ వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు కొట్టారు. బాధితుడికి తీవ్రగాయాలయ్యాయి.
'నేనేం తప్పు చేశా.. పోలీసులు నన్నెందుకు కొట్టారు'
ఏసుబాబు తలకు తీవ్ర గాయం కావడంతో అపస్మారక స్థితిలో ఉన్నటువంటి ఏసుబాబుని కాలనీవాసులు సాయంతో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తగలని చోట తగిలితే తన కుమారుడు మరణిస్తే ఏంటి పరిస్థితి అంటూ బాధితుడి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరు కానిస్టేబుళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఇదీ చదవండి:సోమవారం నుంచి రైతుల రిలే నిరాహార దీక్షలు
TAGGED:
nandigama crime news