విధి నిర్వహణలో ఉంటూ.. కరోనా వైరస్ బారినపడి.. వైద్యం అనంతరం తిరిగి విధులకు హాజరైన పోలీసు సిబ్బందిని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సాదరంగా ఆహ్వనించారు. వారికి ఘనస్వాగతం పలికారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పోలీసు కవాతు మైదానంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వివిధ పోలీసు స్టేషన్‌లలో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది కరోనా బారినపడి, కొవిడ్ ఆసుపత్రులు, హోమ్ ఐసోలేషన్ ద్వారా కరోనాను జయించారని ఎస్పీ తెలిపారు. ప్రపంచానికి ప్రాణాంతకంగా తయారైన కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా.. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు, శక్తి వంచన లేకుండా.. రేయింబవళ్ళు ప్రజాసేవలో విధులు నిర్వహించారని కొనియాడారు. ఈ క్రమంలోనే కొందరికి కరోనా సోకిందన్నారు. తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో విధులో చేరడం ఎంతో అభినందనీయమని ఎస్పీ అన్నారు. నాగాయలంక మండలంలో కరోనా సోకి ఒక వ్యక్తి మరణించడంతో.. సొంత బంధువులు ఎవరు ఖననం చేయటానికి ముందుకురాలేదు. ఆ సమయంలో, మానవత్వంతో ఆ వ్యక్తి మృతదేహాన్ని ఖననం చేసిన నాగాయలంక ఎస్సై కృష్ణ, డిప్యూటీ ఎమ్మార్వో సుబ్బారావులను ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ప్రత్యేకంగా అభినందించారు.
కరోనాను జయించి తిరిగి విధులకు హాజరైన పోలీసు సిబ్బందికి ఘనస్వాగతం - మచిలీపట్నం తాజా వార్తలు
కరోనా మహమ్మారి విజృంభిస్తున్నవేళ వారి వధి నిర్వహణలో వ్యాధి బారిన పడ్డారు. చికిత్స అనంతరం తిరికి విధుల్లో హాజరైన పోలీసు సిబ్బందికి ఘనస్వాగతం పలికారు కృష్ణా జిల్లా ఎస్పీ వీరంద్రనాథ్ బాబు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు, శక్తి వంచన లేకుండా.. రేయింబవళ్ళు ప్రజాసేవలో విధులు నిర్వహిస్తున్నారని సిబ్బందిని కొనియాడారు.
police back to duties