కృష్ణాజిల్లా తిరువూరు మండలం కాకర్ల సమీపంలో 5 రోజుల క్రితం దారుణ హత్యకు గురైన వివాహిత రాధ హత్యోదంతం కేసులో నిందితుడు పోతురాజు వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. విస్సన్నపేట మండలం పుట్రెలకు చెందిన రాధ అనారోగ్యంతో ఉన్న తన తల్లిదండ్రులను చూసేందుకు పోలిశెట్టిపాడు వెళ్లింది. తిరిగి రాకపోవడం వల్ల ఆమె భర్త సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తుండగా ఈ నెల 19న కాకర్ల సమీపంలో రాధ మృతదేహం లభ్యమైంది. అయితే దీనిపై బంధువులు అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు హత్య కోణంలో విచారణ జరిపారు. కాల్‌డేటా ఆధారంగా విచారణ చేపట్టిన అనంతరం కేసును ఛేదించారు.
వివాహిత హత్య కేసులో నిందితుని అరెస్టు - kakarla vagu murder mistary
కృష్ణాజిల్లా తిరువూరు మండలం కాకర్ల సమీపంలో ఐదు రోజులు క్రితం జరిగిన రాధ అనే వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. కాల్‌డేటా ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా పోలీసులు గుర్తించారు.
![వివాహిత హత్య కేసులో నిందితుని అరెస్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4505888-thumbnail-3x2-murdergupta.jpg)
హత్య కేసు