కృష్ణా జిల్లా గుడివాడ డివిజన్ పరిధిలో ద్విచక్రవాహనాలు చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 9వ తేదీన నందివాడ మండలం టెలిఫోన్ నగర్ లో ఇంటిబైట ఉన్న కారు చోరీకి గురికావడంతో ..పోలీసులు బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పోలీసులు కుంచె ఆశీర్వాదం, వంశీ వర్ధన్, కుమార్, కిరణ్, సంజయ్, ఆదోనిని అరెస్టు చేసి విచారించారు. పెదపారుపూడి మండలంలో రెండు ద్విచక్ర వాహనాలు చోరీ చేసినట్టు నిందితులు వెల్లడించారని డీఎస్పీ సత్యానందం తెలిపారు. వారి వద్ద నుంచి కారు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఆయన అన్నారు.
బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ - గుడివాడలో బైకు చోరీలు వార్తలు
కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలో బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి కారు, బైకులు స్వాధీనం చేసుకున్నారు.
![బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ police arrests bike theifs at gudiwada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8821345-460-8821345-1600252554540.jpg)
గుడివాడ పరిధిలో బైకు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్