గంజాయిని విక్రయిస్తున్న సతీశ్ అనే రౌడీషీటర్‌ను విజయవాడ అజిత్‌సింగ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల నగర బహిష్కరణ చేసినప్పటికీ నగరంలోని దేవినగర్ కట్టవద్ద గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టబడ్డాడు. నిందితుడి వద్ద నుంచి 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో సతీష్ పై 21 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డ రౌడీషీటర్ - taja news of ganja in Vijayawada
విజయవాడలో గంజాయిని విక్రయిస్తున్న సతీష్ అనే రౌడీషీటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద ఉన్న సరకు స్వాధీనం చేసుకున్నట్లు అజిత్‌సింగ్ నగర్ పోలీసులు తెలిపారు.
police arrested a old rowdy sheeter selling ganja in Vijayawada