కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో వ్యసనాలకు బానిసలై బైక్‌లను దొంగిలిస్తున్న ముగ్గురు యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 12 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జగ్గయ్యపేటలోని ఎస్జీఎస్ కాలేజీ సమీపంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేయగా.. ఇద్దరు వ్యక్తులు వారిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని విచారణ చేశారు.
విజయవాడ, గుడివాడ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి జగ్గయ్యపేట మండలం అన్నవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్వారా బైక్‌లను తాకట్టు పెట్టి సొమ్ము చేసుకుంటున్నట్లు గుర్తించారు. నిందితులు కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వేల్పుల ఉపేంద్ర, గంటా సాయి నాగేంద్రగా పోలీసులు గుర్తించారు. రికవరీ చెేసిన 12 బైక్‌ల విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని డీఎస్పీ నాగేశ్వర రెడ్డి తెలిపారు. దొంగలను పట్టుకున్న పోలీస్ సిబ్బందికి డీఎస్పీ రివార్డ్‌లను అందించారు.