ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పని లేకుండా రోడ్డుపైకి వస్తే.. మీ పని అంతే! - అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు

లాక్ ​డౌన్ నేపథ్యంలో ప్రజలు రోడ్లపైకి రావద్దని ఎంత చెపుతున్నా.. కొందరు వాహనచోదకులు నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు.

police are punish anybody  Unnecessarily  comming on roads
police are punish anybody Unnecessarily comming on roads

By

Published : Apr 15, 2020, 9:51 AM IST

పని లేకుండా రోడ్డుపైకి వస్తే.. మీ పని అంతే!

సరైన కారణం లేకుండా ఇకపై వాహనాలతో రోడ్డుపైకి వస్తే సీజ్‌ చేస్తామని విజయవాడ పోలీసులు హెచ్చరించారు. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాతే తిరిగి వాహనం అప్పజెపుతామని స్పష్టం చేశారు. వేలాది వాహనాలపై జరిమానాలు విధించినా.. రాకపోకలు ఏమాత్రం తగ్గనందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. లాక్‌డౌన్‌ మొదలు.. ఇప్పటి వరకు నగరంలో 20 వేల వాహనాలపై కేసులు నమోదు చేసి, 50 లక్షల రూపాయల జరిమానా విధించామన్నారు. నగరమంతటా 71 ప్రాంతాల్లో చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details