కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జూన్ 29న జరిగిన వైకాపా నాయకుడు మోకా భాస్కరరావు హత్య కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తిగత కక్షల కారణంగా హత్యకు పాల్పడినట్లు తెలిపిన నిందితులు... చింతా చిన్ని అలియాస్ నాంచారయ్య, చింతా నాంచారయ్య అలియాస్ పులితోపాటు మరో మైనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు బందరు డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. వ్యక్తిగత కక్షలతోపాటు కులపరంగా, రాజకీయపరంగా భాస్కర్‌రావు అడ్డుపడుతున్నాడనే కారణంతో నిందితులు హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇంకెవరి ప్రమేయం ఉందా? అన్న కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల అదుపులో భాస్కరరావు హత్య కేసు నిందితులు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జూన్ 29న జరిగిన వైకాపా నాయకుడు మోకా భాస్కరరావు హత్య కేసులో... నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తిగత కక్షల కారణంగా హత్యకు పాల్పడినట్లు తెలిపిన వారిని విచారిస్తున్నట్లు బందరు డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు.
భాస్కర్ రావు హత్యకు కారణమైన నిందితులను విచారిస్తున్న పోలీసులు