ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వలస కూలీలకు పోలీసు శాఖ అండగా ఉంటోంది: విజయవాడ సీపీ - విజయవాడ సీపీ తాజా వార్తలు

పోలీసులు వలస కూలీలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. కార్మికులందరికీ.... పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శానిటైజర్, ఆహారం సరఫరా చేస్తున్నామని వివరించారు.

police are helping migrant workers in all the times says vijayawada cp dwaraka tirumala rao
వలస కూలీలకు పోలీసు శాఖ అండగా ఉంటోందన్న విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు

By

Published : May 17, 2020, 6:39 PM IST

పోలీసుల తరఫున వలస కూలీలకు బాసటగా నిలుస్తున్నామని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. పోలీస్ శాఖ తరఫున వారికి మాస్క్‌లు, శానిటైజర్, చెప్పులు, పౌష్టికాహారం అందజేస్తున్నామని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 3 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశామని... బంగాల్ వాసులు విజయవాడ పటమటలో వారి పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. కావాలనే కొందరు వారిని రెచ్చగొట్టారని... వారికి తగిలిన దెబ్బలు కొట్టినవి కాదని, లాఠీలు వాడలేదని ఆయన స్పష్టం చేశారు.

వలస కూలీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి అరెస్టయిన వారిని కోర్టులో హాజరుపరుస్దామని ఆయన వివరించారు. రాజకీయపక్షాలు లాక్‌డౌన్ టైమింగ్స్ పాటించాలని... కొత్త సడలింపుల ప్రకారం ముందుకు వెళతామని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details