కృష్ణా జిల్లా గుడివాడలోని సినిమా థియేటర్లలో రెవిన్యూ, పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన జీఓ ప్రకారం ఆర్డీఓ శ్రీను కుమార్ ఆధ్వర్యంలో థియేటర్లలో సౌకర్యాలపై ఆరా తీశారు. ఇప్పటికే పట్టణంలోని తొమ్మిది థియేటర్లను తనిఖీ చేసిన బృందం.. సౌకర్యాలపై యజమానులకు పలు సూచనలు చేశారు. తాజాగా పట్టణంలో ఏలూరు రోడ్డులో బొమ్మరిల్లు మినీ థియేటర్ను సోదా చేసి పలు నిబంధనలు ఉల్లంఘించారంటూ సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో ఎమ్మార్వో శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
థియేటర్లలో సౌకర్యాలపై తనిఖీలు.. బొమ్మరిల్లు మినీ థియేటర్ సీజ్! - POLICE
సినిమా థియేటర్లలో సౌకర్యాలపై కృష్ణా జిల్లా గుడివాడలో రెవెన్యూ, పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించారంటూ పట్టణంలోని ఓ థియేటర్ను సీజ్ చేశారు.
థియేటర్లలో సౌకర్యాలపై తనిఖీలు.. బొమ్మరిల్లు మినీ థియేటర్ సీజ్!