కృష్ణా జిల్లా కైకలూరు మండలం గోపవరంలో కురిసిన వర్షానికి ఓ పెంకుటిల్లు కూలిపోయింది. ఆ ఇంట్లో ఉంటున్న సీతామహాలక్ష్మి అనే ఎనభై ఏళ్ల వృద్ధురాలు శిథిలాల మధ్యలోనే ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆమెను రక్షించారు. తీవ్ర గాయాలపాలైన సీతామహాలక్ష్మిని ఆసుపత్రికి తరలించారు.
కూలిన ఇల్లు...వృద్ధురాలిని కాపాడిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది - gopavaram old lady rescued by police news
ఇల్లు కూలిపోయి శిథిలాల మధ్యలో ఇరుక్కుపోయిన వృద్ధురాలిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఈ ఘటన కృష్ణా జిల్లా గోపవరంలో జరిగింది.
వృద్ధురాలిని కాపాడిన పోలీసులు