PM Modi Tour: తెలంగాణ పర్యటనకు శనివారం వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలకాలని కమలదళం నిర్ణయించింది. ప్రధాని 12న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ సహా ఇతర నేతలు ఆయనకు స్వాగతం పలుకుతారు. ఎయిర్‌పోర్టు ప్రాంగణంలోనే ప్రధానికి స్వాగత సభను ఏర్పాటుచేస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసే వేదిక నుంచి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.
ప్రధాని తెలంగాణ పర్యటనకు భాజపా భారీ ఏర్పాట్లు.. - pm modi telangana tour
PM Modi Tour: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తెలంగాణ పర్యటనకు భాజపా భారీ స్థాయిలో స్వాగత సభ ఏర్పాట్లు చేస్తోంది. వేలాది మందితో ఈ సభను నిర్వహంచనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ భాజపా ముఖ్య నేతలతోనూ ప్రధాని భేటీ కానున్నారు. దీంతో స్థానిక రాజకీయ అంశాలపైనా చర్చించే అవకాశాలున్నాయి.
మే 26న హైదరాబాద్‌లోని ఐఎస్‌బీ స్నాతకోత్సవానికి వచ్చినప్పుడు బేగంపేట ఎయిర్‌పోర్టులో ఏర్పాటుచేసిన స్వాగత సభలో ప్రధాని సుదీర్ఘంగా రాజకీయ ప్రసంగం చేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని పర్యటన, బేగంపేటలో స్వాగతసభ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. స్వాగత సభ అనంతరం ప్రధాని హెలీకాప్టర్‌లో రామగుండం వెళతారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు మోదీకి అక్కడ స్వాగతం పలకనున్నారు. ఎరువుల కర్మాగారాన్ని మోదీ జాతికి అంకితం చేస్తారు. దీంతోపాటు మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.భద్రాచలం రోడ్‌సత్తుపల్లి రైలు మార్గాన్ని జాతికి అంకితం చేస్తారు. ప్రధాని పర్యటనపై సీఎస్ సోమేశ్‌కుమార్ గురువారం సమీక్ష నిర్వహించారు.
ఇవీ చదవండి: