ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంకా లాటరీ తీయలేదు.. శ్మశానం పక్క ప్లాట్లు ఎవరికో? - కృష్ణా జిల్లాలో శ్మశానం పక్కన ప్లాట్లు న్యూస్

విజయవాడలో ఉండే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని.. ఎకరం రూ. 70 లక్షల చొప్పున భూమి కొన్నారు. అందులో లే అవుట్లు కూడా వేసి రాళ్లు పాతారు. తీరా ఆ స్థలం చూసి దరఖాస్తుదారులు లబోదిబోమంటున్నారు. పక్కనే శ్మశానం ఉంది మరి..

plots near barrial ground at krishna district
plots near barrial ground at krishna district

By

Published : Jul 11, 2020, 11:56 AM IST

కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం వణుకూరు శివార్లలో రైతుల వద్ద 13.50 ఎకరాలు కొని.. లే అవుట్‌ చేశారు. ఈ లేఅవుట్‌ను ఆనుకుని ఉన్న చిన్న రోడ్డుకు అవతలి వైపే శ్మశానవాటిక ఉంది. అది దాదాపు నిండిపోవడంతో రోడ్డుకు ఇటువైపు.. అంటే లే అవుట్‌ ప్రాంతంలోనూ కొన్ని సమాధులు వచ్చాయి. ఇలా దాదాపు 10 ప్లాట్లలో సమాధులున్నాయి. ఇంకా లాటరీ తీయలేదు కాబట్టి ఇవి ఎవరికి వస్తాయో తెలియదు!

శ్మశానం పక్కన, సమాధుల్లో తమకు స్థలాలు ఎలా ఇస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ నగర పేదల కోసం ఈ చుట్టు పక్కల మొత్తం 279 ఎకరాలు కొనుగోలు చేశారు. కృష్ణాజిల్లాలో 1479 లేఅవుట్లు ఏర్పాటు చేయగా, వాటిలో చాలావరకు ఇలా శ్మశానాల పక్కన ఉన్నాయంటున్నారు. వణుకూరు లేఅవుట్‌పై తహసీల్దారు భద్రును సంప్రదించగా, అది ప్రైవేటు భూమి అని, అక్కడ సమాధులు ఉన్న ప్రాంతాన్ని వదిలేస్తామని చెప్పారు. రెండు సెంట్ల వరకు వదిలేయాలని నిర్ణయించామమని వెల్లడించారు. ఇతర ప్లాట్లలో సమాధులు లేవని చెప్పారు.

ఇదీ చదవండి:దేశంలో మరో 27,114 కేసులు.. 519 మరణాలు

ABOUT THE AUTHOR

...view details