భూతాపంతో ప్రమాద ఘంటికలు మోగుతున్న సమయంలో.. పర్యావరణానికి మరో ముప్పు ప్లాస్టిక్ రూపంలో పొంచి ఉంది. ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు, క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఇతర వస్తువుల వినియోగం విస్తృతమై.. పర్యావరణానికి ప్రమాదకరంగా మారింది. విచ్ఛలవిడిగా ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తూ... కాలుష్యానికి కారకులౌతున్నారు. ప్రభుత్వం ప్లాస్టిక్ నిర్మూలనకు ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రజల నుంచి మాత్రం సహకారం అంతంతమాత్రంగా ఉంది.
మన విజయవాడ!
ప్లాస్టిక్ రహిత నగరంగా విజయవాడను తీర్చిదిద్దే క్రమంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, నగరపాలక కమిషనర్ ప్రసన్న వెంకటేష్ 'మన విజయవాడ' కార్యక్రమాన్ని చేపట్టారు. వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా ప్లాస్టిక్ అవరోధాన్ని కలిగిస్తోంది. ఆ కారణంగా భూసారం తగ్గిపోతుంది. ఈ విషయాన్ని వివరిస్తూ... ప్రజలు చైతన్యవంతులై విజయవాడను పరిశుభ్రంగా ఉంచాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అధికారులు చేబుతున్నా... ఆచరణలో మాత్రం ఆశించిన ఫలితం కనిపించడంలేదు. ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై పూర్తిస్థాయిలో నిర్ణయాలు తీసుకోకుండా కవర్ల వాడకం వదిలేయండి.. అంటే ఎలా అంటూ సగటు ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
జ్యూట్ బ్యాగుల పంపిణీ