వైకాపా ప్రభుత్వం వచ్చాక ఐటి, ఇతర పరిశ్రమలు ఏమి తేలేదని మాజీ మంత్రి పీతల సుజాత విమర్శించారు. తెదేపా హయంలో వచ్చిన వాటిని వెనక్కి తోలేసి మొదటి ర్యాంక్ ఎలా సాధించారని ప్రశ్నించారు. ఇది కలా లేక నిజమా,అని డైలమాలో మంత్రి గౌతంరెడ్డి ఉండిపోయారని ఎద్దేవా చేశారు. తర్వాత తేరుకుని కియా పరిశ్రమ తెచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారని అన్నారు. ఇప్పుడైనా వైకాపా ప్రభుత్వానికి చంద్రబాబు అంటే ఏమిటో అర్ధమైందా అని ప్రశ్నించారు.
'మంత్రి తేరుకొని.. చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు' - పీతల సుజాత వార్తలు
తెదేపా ప్రభుత్వ హయాంలో వచ్చిన పరిశ్రమలను.. వైకాపా ప్రభుత్వం వెనక్కి తోలేసి.. మెుదటి ర్యాంక్ ఎలా సాధించారని మాజీ మంత్రి పీతల సుజాత ప్రశ్నించారు.

పీతల సుజాత