ప్రభుత్వ సామాజిక భవనాల్లో చర్చీలు నిర్వహించడంపై కృష్ణా జిల్లా(krishna district) ఈలప్రోలుకి చెందిన మెలం రమేష్.. హైకోర్టు(High Court)లో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరుఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ సామాజిక భవనాన్ని బలవంతంగా ఆక్రమించుకుని చర్చీ నిర్వహిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. స్పందించిన కోర్టు.. ఎస్సీ ప్రజల సామాజిక కార్యక్రమాలకోసం నిర్మించిన భవనాల్లో.. ప్రార్థనాలకు ఎలా అనుమతిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది.