తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల వేలంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆస్తుల వేలం నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ అనంతపురానికి చెందిన భాజపా నేత జంగటి అమర్ నాధ్ హైకోర్టును ఆశ్రయించారు. 2016లో నిర్ణయించిన 50 ఆస్తుల వేలాన్ని మాత్రమే ప్రభుత్వం నిలిపివేసిందన్న పిటిషనర్ మరో 23 ఆస్తులు వేలం వేసేందుకు తితిదే సన్నాహాలు చేస్తోందని కోర్టుకు వివరించారు. భవిష్యత్తులో తితిదే ఆస్తులు వేలం వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. తితిదే ఆస్తులను కాపాడటానికి జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
తితిదే ఆస్తుల వేలంపై హైకోర్టులో వ్యాజ్యం - ttd land news
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల వేలంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది.
తితిదే ఆస్తుల వేలంపై హైకోర్టులో వ్యాజ్యం