స్థిరాస్తి వ్యాపారం చేసే నిమ్మగడ్డ చైతన్య విజయవాడలోని పటమటలో నివాసం ఉంటున్నారు. బెంజిసర్కిల్ సమీపంలోని తన బంధువుకు చెందిన భవనం చూసేందుకు వెళ్లారు. అక్కడ ఆకాశంలో గుంపులుగా తిరుగుతున్న అడవి పావురాలను చూశారు. వాటికి ఆహారంగా జొన్నలను డాబాపై చల్లారు. గింజలను తింటున్న పావురాలను చూసి ఆనందం కలగడంతో ప్రతిరోజు గింజలు వేయడం ప్రారంభించారు. మొదట 30 పావురాలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య వందకు చేరింది. మధ్యాహ్నం అయితే చాలు పావురాలు అక్కడికి చేరుకొని చైతన్య కోసం ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటాయి. ప్రతి నెల 60 నుంచి 70 కిలోల జొన్నలు పావురాలకు ఆహారంగా వేస్తున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఒకటిన్నర వరకు వాటికి భోజన సమయం. ఆ సమయంలో మాత్రమే పావురాలు అక్కడికి వస్తుంటాయి. ఆయన పని మీద బయటకు వెళ్లినా.. ఊరెళ్లినా స్నేహితుల ద్వారా పావురాలకు ఆహారం అందిస్తారు. వాటిని చూస్తే మనసుకు ఎంతో ఆహ్లాదంగా సంతోషంగా ఉంటుందని పావురాలకు ఆహారం వేయడం అభిరుచిగా మారిపోయిందని చైతన్య తెలిపారు.
అదిరిందయ్యా... నీ ఆతిథ్యం - పావురాలకు ఆహారం
గ్రామాలలో ఉండే పక్షులకైతే ఆహారం పుష్కలంగా దొరుకుతుంది... ఎందుకంటే చెట్లు, నీళ్లు ఉంటాయి. మరి పట్టణాల్లో ఉన్న పక్షుల పరిస్థితి ఎంటి? ఎక్కువ సంఖ్యలో ఉండే పావురాల్లాంటి పక్షులకు ఆహారం ఎలా? అది ఆలోచించిన ఓ వ్యక్తి పావురాలకు ఆతిథ్యం ఇస్తున్నాడు. గత మూడేళ్లుగా ఇలాగే చేస్తున్నాడు విజయవాడకు చెందిన నిమ్మగడ్డ చైతన్య.
![అదిరిందయ్యా... నీ ఆతిథ్యం అదిరిందయ్యా... నీ ఆతిథ్యం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5760635-189-5760635-1579414508925.jpg)
అదిరిందయ్యా... నీ ఆతిథ్యం
Last Updated : Jan 19, 2020, 11:46 AM IST