నందిగామ పట్టణ పరిశుభ్రతే ప్రభుత్వ లక్ష్యమని...ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా పనిచేస్తున్నామని మున్సిపల్ ఛైర్పర్సన్ వరలక్ష్మి, పురపాలక కమిషనర్ జయరాం అన్నారు. బీసీ కాలనీ, డీవీఆర్ కాలనీల్లో ప్రజా ఆరోగ్యానికి భంగం వాటిల్లే పందుల నిర్మూలనా కార్యక్రమానికి మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ రెడ్డి, వార్డు సెక్రటరీలు పాల్గొన్నారు.
నందిగామలో పందుల నిర్మూలన కార్యక్రమం - Pig eradication program at Nandigama
పందులు పట్టడం అందరూ సులువు అనుకుంటారు.. కానీ చాలా కష్టం. ఎందుకంటే అవి చాలా బలంగా ఉంటాయి. సులువుగా జారిపోతుంటాయి. తప్పించుకునే క్రమంలో ఒక్కొక్క సారి అవి మనల్ని గాయపరుస్తాయి. అయితే వరాహాలను ప్రత్యేక ప్రణాళిక వేసి...వలలతో పట్టుకోవాలి. వీటిని తరలించే సమయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నందిగామలో పందుల నిర్మూలన కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు.
నందిగామలో పందుల పట్టివేత