ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్యుడి ప్రయత్నం.. మందుబాబుల ముందు విఫలం - కృష్ణా జిల్లాలో మద్యం వార్తలు

మద్యం దుకాణం వద్ద ఓ వైద్యుడు.. మందు బాబులకు వినూత్న అవగాహన కల్పించాలనుకున్నాడు. మద్యం సేవించొద్దంటూ మందు కోసం బారులు తీరిన వారిని విజ్ఞప్తి చేశాడు. కానీ మందే ముఖ్యం.. నువ్వెన్ని చెప్పినా వినమనుకున్నారో ఏమో.. వారంతా వైద్యుడి మాటలు పక్కన పెట్టి.. మద్యం కొనుక్కున్నారు.

Physician awareness on drinking alcohol is not good for health at Mowwa in krishna
Physician awareness on drinking alcohol is not good for health at Mowwa in krishna

By

Published : May 10, 2020, 5:41 PM IST

Updated : May 10, 2020, 9:23 PM IST

వైద్యుడి ప్రయత్నం.. మందుబాబుల ముందు విఫలం

కృష్ణా జిల్లా మొవ్వ మండలంలో బార్‌ షాపు ముందు బారులు తీరిన మందు బాబులకు.. స్థానిక వైద్యుడు వినూత్నంగా అవగాహన కల్పించారు. ఎండను సైతం లెక్కచేయకుండా మద్యం కోసం లైన్‌లో నిలబడిన వాళ్లతో మాట్లాడారు.

మద్యపానం ఆరోగ్యానికి హానికరమంటూ వివరించారు. ఏమైనా జరిగితే మీతో సహా మీ కుటుంబం కూడా నష్టపోతుందని వివరించారు. ఎంతకీ లెక్క చేయని మందుబాబులు.. ఆయన మాటలను పక్కనపెట్టి మద్యం కొనుగోలు చేశారు.

Last Updated : May 10, 2020, 9:23 PM IST

ABOUT THE AUTHOR

...view details