ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన 'ఫొని' తుపాను మే 2, 3 తేదీల్లో ఉత్రరాంధ్ర తీరానికి దగ్గరగా ప్రయాణం చేయనుంది. తీరాన్ని మాత్రం ఎక్కడ తాకుతుందో స్పష్టత రాలేదు. బుధవారం పెనుతుపానుగా మారే 'ఫొని' తీవ్రతకు 150 కి.మీ. నుంచి 185 కి.మీ. వరకు గాలులు వీచే అవకాశాలు ఉంది. నేడు, రేపు కేరళ, తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చని.. కేరళలో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెప్పారు. మే 2,3 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఒడిశాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని.. ఒడిశా తీరంలో మాత్రం భారీ వర్షాలు పడే అవకాశముంది. తుపానుపై గమనంపై రేపటికి స్పష్టత వచ్చే అవకాశముంది.
ఉత్తరాంధ్రకు ముప్పుగా 'ఫొని' పయనం - wind
ఫొని తుపాను తీవ్రత పెరుగుతోంది. తుపాను క్రమంగా దిశను మార్చుకుని ఉత్తరాంధ్ర , ఒడిశా దిశగా కదిలే అవకాశాలున్నాయని అధికారులు ప్రకటించారు.
ఫోని తుపాను