పీజీ మెడికల్ మొదటి విడత కౌన్సెలింగ్‌కు విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కసరత్తులు ముమ్మరం చేసింది. కౌన్సెలింగ్ ప్రక్రియలో కీలకమైన సీట్ మ్యాట్రిక్స్‌ను విడుదల చేసేందుకు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ సన్నద్ధమైంది. ప్రస్తుతం ఫీజులపై ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యంతో సంప్రదింపులు జరుగుతున్నాయి. 2017-18 విద్యా సంవత్సరానికి నిర్ణయించిన ఫీజుల గడువు గత ఏడాదితో ముగియగా, ఈ ఏడాది కొత్తగా ఫీజులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
పీజీ మెడికల్ మొదటి విడత కౌన్సెలింగ్‌కు సన్నద్ధం
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పీజీ మెడికల్ మొదటి విడత కౌన్సెలింగ్‌కు సిద్ధమవుతుంది. విజయవాడలో కౌన్సెలింగ్ ప్రక్రియలో కీలకమైన సీట్ మ్యాట్రిక్స్‌ను విడుదల చేసేందుకు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
భారతీయ వైద్య మండలి నిబంధనల మేరకు పీజీ మెడికల్, డెంటల్ ప్రవేశాలను మే 31 లోగా ముగించాల్సి ఉంది. కరోనా కారణంగా ఈ గడువును జూన్ 30 వరకు పొడిగించాలని అన్ని రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు కోరాయి. దీనిపై ఎంసీఐ ఇంకా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. కరోనా వైద్య సేవలందిస్తున్నందున ప్రస్తుతం పీజీ చేస్తున్న విద్యార్థులకు రెండు నెలల ఉపకార వేతనాలు అందించాలని, వారిని రెసిడెంట్ డాక్టర్లుగా చూడాలని ఎంసీఐ తాజాగా మార్గనిర్దేశకాలను జారీ చేసినట్టు తెలుస్తోంది.
ఇవీ చూడండి...