విజయవాడలోని ఆటోనగర్‌లో ఓ బంక్ నుంచి పెట్రోల్‌కు బదులుగా నీళ్లు వచ్చాయి. హిందుస్తాన్ పెట్రోలియంకు చెందిన ఓ ప్రైవేటు బంక్‌లో ఇంధనం పోయించుకున్న వాహనాలన్నీ మరమ్మతులకు గురయ్యాయి. ఇంధనం బయటకు తీసి పరిశీలించగా.. అంతా నీరు ఉండటంతో వాహనదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై బంక్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా... ఇటీవల కురిసిన వర్షాలకు పెట్రోలు ట్యాంక్‌లోకి నీళ్లు వచ్చినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బంక్‌లో పెట్రోల్‌కు బదులుగా నీళ్లు.. కేసు నమోదు - Water in Autonagar petrol bunk
ఓ పెట్రోల్ బంక్ సిబ్బంది నిర్వాకం వాహనదారులను ఆగ్రహానికి గురి చేసింది. ఇటీవల కురిసిన వర్షాలకు బంక్‌లో పెట్రోల్ నిల్వ చేసే ట్యాంక్‌లోకి నీరు చేరింది. అది గమనించని బంక్ సిబ్బంది వినియోగదారుల వాహనాల్లో నీళ్లను నింపారు. వాహనాలు ముందుకు కదలక మొరాయించాయి. దాంతో అసలు విషయం బయటపడింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
పెట్రోల్‌కు బదులుగా నీళ్లు