ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీవో107ను సమర్థిస్తూ హైకోర్టులో 450మంది పిటిషన్లు - రాజధాని ప్రాంతాల్లోని భూముల్లో ఇళ్ల స్థలాలు కేటాయింపు వార్తలు

రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వైకాపా సర్కార్ జారీ చేసిన జీవో 107ను సమర్థిస్తూ సుమారు 450 మంది హైకోర్టులో అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపుల ద్వారా తాము ప్రయోజనం పొందుతామన్నారు. ఈ నేపథ్యంలో తమను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేసుకొని వాదనలు వినిపించేందుకు తావివ్వాలని కోరారు.

ఇళ్ల స్థలాల కేటాయింపు జీవోపై హైకోర్టులో పిటిషన్లు
ఇళ్ల స్థలాల కేటాయింపు జీవోపై హైకోర్టులో పిటిషన్లు

By

Published : Mar 4, 2020, 7:56 AM IST

రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి సమీకరించిన భూమిలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి 1251 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం జారీచేసిన జీవో 107ను సమర్థిస్తూ సుమారు 450 మంది హైకోర్టులో అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు సిద్ధం చేసిన లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లున్నాయన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపుల ద్వారా తాము ప్రయోజనం పొందుతామన్నారు. ఈ నేపథ్యంలో తమను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేసుకొని వాదనలు వినిపించేందుకు తావివ్వాలని మంగళగిరి, తాడేపల్లికి చెందిన పలువురు ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు. రైతులు నుంచి సమీకరించిన భూమిలో పేదలందరికీ ఇళ్లు పథకం కింద 1251 ఎకరాల్లో గుంటూరు జిల్లా తాడేపల్లి, పెదకాకాని, మంగళగిరి, దుగ్గిరాల మండలాలు, కృష్ణా జిల్లా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 54,307 మంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు ఇళ్ల స్థలాల కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 25న జీవో 107ను జారీచేసింది. ఆ జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు అయిన విషయం తెలిసిందే .

ABOUT THE AUTHOR

...view details