రోడ్డు పక్కనే పడి ఉన్న వ్యక్తికి ముఖం కడిగి.. పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ఓటు వేయించేందుకు ప్రయత్నించారు స్థానికులు. ఓటు వేసేంతసేపు కూడా నిలబడే ఓపిక అతడికి లేకపోవడంతో ఇదిగో ఇలా దగ్గరుండి బ్యాలెట్ పేపర్‌పై ముద్ర వేయించి మమ అనిపించారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు నాయకులు పంపిణీ చేసిందో లేక సొంతంగానో మద్యం తాగి మత్తుతో పడిపోయిన ఆ వ్యక్తిని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చేందుకు నానాతంటాలు పడ్డారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ఈ దృశ్యాలు కనిపించాయి.
ఒట్టు సా....ర్ ఓటేద్దామనే అనుకున్నా! - పెనుగంచిప్రోలు పంచాయతీ ఎన్నికలు వార్తలు
ఫూటుగా మద్యం తాగి ఉన్న వ్యక్తి చేత ఓటు వేయించేందుకు తంటాలు పడ్డారా స్థానికులు.. ఎంతో కష్టపడి పోలింగ్ కేంద్రం వరకు తీసుకువెళ్లారు.. మద్యం మత్తు నషాళానికి అంటుకుందో ఏమో మరి.. బ్యాలెట్ పేపర్ మీద ముద్ర వేసేందుకు ఓపిక లేనంతగా తుళ్లి పడి.. పోలింగ్ కేంద్రంలోనే చతికిలపడ్డాడు. మరి తరువాత ఏమయ్యిందంటే..!

ఓటేసేందుకు వచ్చి చతికిలబడ్డాడు