ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఉల్లి కోసం వరుసలో నిలబడిన ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. కృష్ణా జిల్లా గుడివాడ రైతుబజారు వద్ద రాయితీ ఉల్లి కోసం వచ్చిన సాంబయ్యకు గుండెపోటు వచ్చింది. ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో అతను మృతి చెందాడు. చాలాసేపటి నుంచి క్యూలో ఉండడం వల్ల కళ్లు తిరిగి కిందపడ్డాడనీ.. అప్పుడే గుండెపోటు వచ్చిందని అక్కడున్నవారు తెలిపారు.
ఉల్లి కోసం వచ్చి.. గుండెపోటుతో వ్యక్తి మృతి - గుడివాడలో ఉల్లి కోసం వరుసలో నిలబడి వ్యక్తి మృతి
ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఉల్లి కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడుతూ వృద్ధులు, మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉల్లి కోసం లైనులో నిలబడ్డ ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా గుడివాడ రైతుబజారులో జరిగింది.
గుడివాడలో ఉల్లి కోసం వచ్చి.. గుండెపోటుతో మృతి