కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని గట్టు భీమవరం జీఎంఆర్ టోల్ గేట్ బోర్డుకు ఒక వ్యక్తి ఉరి వేసుకొని మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నాడా..? లేదా ఎవరైనా హత్య చేసి టోల్‌గేట్ బోర్డుకి ఉరి వేశారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
టోల్ గేట్ బోర్డుకు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మ'హత్య' - కృష్ణా జిల్లా వార్తలు
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట గట్టు భీమవరం జీఎంఆర్ టోల్ గేట్ బోర్డుకు ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
person died in krishna dst jaggayapeta to tollgate gate