గ్రామీణ క్రీడ కబడ్డీకి పూర్వ వైభవం తెచ్చేలా ఆదరించాలని మంత్రి పేర్ని నాని అన్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ డిగ్రీ కళాశాలలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ నెల 23 వతేదీ వరకు పోటీలు జరగనున్నాయి. ఇక్కడ ఆడిన క్రీడాకారులు తమ నైపుణ్యం ద్వారా దేశ స్థాయికి ఎదగాలన్నారు.
అవనిగడ్డలో రాష్ట్రస్థాయి సీనియర్స్ కబడ్డి పోటీలు..
అవనిగడ్డలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను మంత్రి పేర్ని నాని శనివారం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ సహకారంతో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఈ క్రీడలను నిర్వహిస్తున్నారు.
అవనిగడ్డలో రాష్ట్రస్థాయి సీనియర్స్ కబడ్డి పోటీలు.. ప్రారంభించిన పేర్ని నాని
13 జిల్లాల నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు, 50 మంది టెక్నికల్ సిబ్బంది పాల్గొంటున్నారని ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సెక్రెటరీ శ్రీకాంత్ చెప్పారు.
ఇదీ చదవండి:మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. గరిటె తిప్పిన దేవినేని అవినాష్!