ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వర్షాలతో జీవితాలు అస్తవ్యస్తం

రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల వర్షపు నీరు ఇంట్లోకి చేరి సామగ్రిని నాశనం చేస్తుంటే...మరి కొన్నిచోట్ల ఇళ్లే కుప్పకూలి నిలువ నీడ లేకుండా చేస్తున్నాయి. అధికారులు స్పందించి రక్షణ గృహలకు తరలించటం, చికిత్స చేయించటం వంటి చర్యలు చేపడుతున్నప్పటికీ...నిలువ నీడను కోల్పోయిన తమకు శాశ్వత పరిష్కరాన్ని చూపించాలని బాధితులు కోరుకుంటున్నారు.

rain fall in krishna
కృష్ణాజిల్లాలో వర్షం

By

Published : Oct 20, 2020, 7:54 PM IST

కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సి. గుడిపాడు గ్రామంలో వ్యవసాయ కూలీలైన విస్సంపల్లి సందీప్, శివ కుమారి అనే దంపతులు చిన్న పెంకుటింట్లో నివసించేవారు. అల్పపీడన కారణంగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నీరు నిలిచి ఆ ఇల్లు కూళిపోయింది. ఘటన సమయంలో దంపతులు పనులకు వెళ్లగా...పిల్లలు లోపలే ఉన్నప్పటికి సురక్షితంగా బయటపడ్డారు. నిలువ నీడ కోల్పోయి, తినేందుకు తిండి లేక రోడ్డుపైన కట్టుబట్టలతో దీనంగా నిలబడింది ఆ కుటుంబం . ప్రస్తుతం వర్షం కారణంగా సమీపంలోని ఎలిమెంటరీ పాఠశాలలో తల దాచుకుంటున్నారు. అధికారులు, ప్రభుత్వము స్పందించి నిలువ నీడలేని తమకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని... ఆర్థిక చేయూతనందించాలని బాధితులు వేడుకుంటున్నారు.

రోడ్లు అస్తవ్యస్తం

ఎడతెరపి లేని వర్షాలకు బాపులపాడు మండలం బండారు గూడెం గ్రామంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. రహదారులపై పారుతున్న మురుగుతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఇదీ చదవండీ...ఊరి కోసం..నాసా పర్యటననే వదులుకున్న యువతి

ABOUT THE AUTHOR

...view details