కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టే విషయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) కోరారు. లాక్డౌన్ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో పరిస్థితిపై మరో మంత్రి కొడాలి నానితో కలిసి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా రోజుకో రకంగా కలవరపెడుతుందని...దిల్లీ మత ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారి వివరాల కోసం అధికారులు శ్రమిస్తున్నారన్నారు. కడప, గోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్‌గా గుర్తించబడ్డ వ్యక్తులు పైకి ఆరోగ్యంగా కనిపిస్తున్నారని, ఎలాంటి రోగ లక్షణాలు కనిపించలేదన్నారు. దీన్ని బట్టి కరోనా వ్యాధిగస్తులను గుర్తించటం కష్టమవుతుందని పేర్ని వ్యాఖ్యానించారు. ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు.
కరోనా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పేర్ని నాని - ఏపీలో కరోనా వార్తలు
కరోనా వైరస్ విషయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి పేర్నినాని సూచించారు. వ్యాధి సోకిన వ్యక్తులు పైకి ఆరోగ్యంగా కనిపిస్తున్నారని, ఎలాంటి రోగ లక్షణాలు బయటపడటం లేదని అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
కరోనా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి