కృష్ణా జిల్లా నందిగామలో.. కొందరు వ్యక్తులు.... స్వార్ధ ప్రయోజనాల కోసం వృక్షాలను హరిస్తున్నారని ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణ వాయువు ప్రసాదించే.... వృక్షాల గుండెల్లో... ప్రకటనల బోర్డులతో .. లెక్కలేని మేకులు కొట్టి... వృక్షాలను హింసిస్తున్నారన్నారు. ప్రాణదాతలకు దింపిన మేకులను తొలగించిన వారు.. ఇకపై ఇలాంటి చర్యలను పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు.
ప్రాణదాతల సంరక్షణకు నడుం బిగించిన ప్రకృతి ప్రేమికులు - నందిగామలో ప్రకృతి ప్రేమికులు
వృక్షాల రక్షణకు కృష్ణా జిల్లా నందిగామలోని ప్రకృతి ప్రేమికులు నడుం బిగించారు. ప్రకటన బోర్డుల కోసం వృక్షాలకు మేకులు దింపుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లాలోని వృక్ష ప్రేమికులు అధికారులకు వినతి పత్రం అందజేశారు. చెట్లకు దింపిన మేకులను తొలగించారు.
tree savers
'మొక్కలు నాటడం ఒక యజ్ఞం. మొక్కలను చెట్లుగా పెంచడం మహాయజ్ఞం.. నిత్యం వెల కట్టలేని ప్రాణవాయువు ఇచ్చే వృక్షాలను కాపాడుకోవడం అందరి బాధ్యతగా గుర్తించాలి. మొక్కలు నాటేందుకు ప్రభుత్వాలు ఖర్చుపెట్టే కోట్ల రూపాయలు వృథాకాకుండా వృక్ష సంపదని కాపాడుకుంటే.... భవిష్యత్తులో ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని బతకాల్సిన పరిస్థితులు రాదని' ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: 'కరోనా విపత్తును ఎదుర్కోవడంలో సీఎం విఫలమయ్యారు'