ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మా భూముల్ని లాక్కోవద్దు: ప్రభుత్వానికి ప్రజల వేడుకోలు - భుముల కోసం అవనిగడ్డలో నిరాహార దీక్షలు

గతంలోని ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన భూముల్ని... ప్రస్తుత సర్కారు తీసుకోవటం పట్ల కృష్ణాజిల్లా అవనిగడ్డ ప్రజలు ఆగ్రహిస్తున్నారు. తమ భూముల్ని లాక్కోవద్దంటూ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.

people protest in avanigadda for their lands at krishna
ప్రభుత్వమా.. నీకిది తగదు.. మా భూముల్ని లక్కోవద్దు

By

Published : Jan 31, 2020, 9:44 PM IST

మా భూముల్ని లాక్కోవద్దు: ప్రభుత్వానికి ప్రజల వేడుకోలు

అవనిగడ్డలోని పేదల భూములను... ఇళ్ల స్థలాల కోసం తీసుకోవద్దని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలకు జనసేన, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మద్దతు తెలిపాయి. ఆయా పార్టీల కార్యకర్తలు... బాధితులకు సంఘీభావంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. గతంలో ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను.. ఇప్పుడు పేదల ఇండ్ల స్థలాల కోసం తీసుకోవడం దారుణమన్నారు. వాటిమీదే ఆధారపడి బతుకుతున్నామని... ఇప్పుడు ఇలా చేస్తే తమ పరిస్థితి ఏంటని బాధితులు వాపోతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details