రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నియోజకవర్గం సాక్షాత్తు రాయితీ ఉల్లి కోసం క్యూలైన్లలో నుంచుని సాంబిరెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనతో అధికారులు స్పందించి హుటాహుటిన రైతు బజారులో ఉన్న ఉల్లిపాయల కేంద్రాన్ని ఎన్టీఆర్ క్రీడా మైదానానికి మార్చారు. రాయితీ ఉల్లి కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు స్టేడియంలో బారులు తీరారు. గంటల కొద్దీ వేచి ఉన్నా మనిషికి కేజీ ఉల్లిపాయలు మాత్రమే ఇవ్వడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పనులు మానుకొని ఉదయమే రావలసి వస్తుందని, రేషన్ డీలర్లు లేదా వాలంటీర్ల ద్వారా రాయితీ ఉల్లిని పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
గుడివాడలో ఉల్లి కోసం బారులు తీరిన జనం - People on the barges for sabsidy onions at ntr stadium gudivada
రాయితీ ఉల్లి కోసం కృష్ణా జిల్లా గుడివాడలో జనం బారులు తీరారు. రేషన్ డీలర్ల ద్వారా లేదా వాలంటీర్ల ద్వారా గాని రాయితీ ఉల్లిపాయలు అందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
గుడివాడలో ఉల్లి కోసం బారులు తీరిన జనం