ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యాక్సిన్ కోసం బారులు... తప్పని ఇబ్బందులు - కృష్ణాజిల్లా ముఖ్యంశాలు

కృష్ణా జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం ప్రజలు బారులు తీరారు. కొన్ని చోట్ల తోపులాట జరిగింది. ప్రభుత్వ వీలైనన్ని ఎక్కువ కొవిడ్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం బారులు తీరిన ప్రజలు
కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం బారులు తీరిన ప్రజలు

By

Published : May 8, 2021, 4:30 PM IST

Updated : May 8, 2021, 9:39 PM IST

కృష్ణా జిల్లా కంచికచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వ్యాక్సిన్ కోసం ప్రజలు బారులు తీరారు. వ్యాక్సిన్ కోసం కొద్దిపాటి తోపులాట జరిగింది. పోలీసులు ప్రజలను క్యూ లైన్‌లో ఉంచి వ్యాక్సిన్ వేయిస్తున్నారు. వీరులపాడు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాక్సిన్ కోసం ప్రజలు బారులు తీరారు.

నందిగామలో...

నందిగామ వార్డు సచివాలయంలో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలకోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం ఏడు గంటల నుంచే పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. రిజిస్ట్రేషన్ చేసి టీకా వేసేందుకు స్లిప్పులు అందజేశారు. కొవాగ్జిన్‌ రాలేదని కేవలం కొన్ని కొవిషీల్డ్‌ టీకాలు మాత్రమే వేస్తామని చెప్పటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిషీల్డ్ రెండో డోస్‌ వారికే ఇప్పుడు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉదయం నుంచి టీకాలకోసం నిరీక్షించినా లేదని చెప్పటం పై అక్కడి వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడలో..

విజయవాడలో కొవిడ్‌ పరీక్షల కోసం ప్రజలు పెద్ద ఎత్తున బారులుతీరారు. దీంతో కొవిడ్‌ పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది. కొవిడ్‌ ప్రమాణాలు ఎక్కడా కానరాలేదు. ప్రభుత్వం వీలైనన్ని ఎక్కువ కొవిడ్‌ పరీక్షాకేంద్రాలు ఏర్పాటుచేయాలని ప్రజలు డిమాండ్‌చేస్తున్నారు. అరకొరా సిబ్బందితో గంటలు తరబడి ప్రజలు బారులుతీరేలా ఏర్పాట్లుచేస్తే కొవిడ్‌ మరింత ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి:

కడప జిల్లా మామిళ్లపల్లె శివారులో పేలుడు.. 10కి చేరిన మృతుల సంఖ్య!

డీఆర్​డీఓ కొవిడ్​ ఔషధానికి డీసీజీఐ అనుమతి

Last Updated : May 8, 2021, 9:39 PM IST

ABOUT THE AUTHOR

...view details