కృష్ణా జిల్లా నందిగామ మార్కెట్ యార్డులో ఆవరణలోని సంతలో వందలాది ప్రజలు ఒకే చోట చేరుతున్నారు. కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని తెలిసినా... చాలామంది మాస్కులు పెట్టుకోకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రతి శనివారం నందిగామలో పశువుల సంత నిర్వహింస్తుంటారు. ఇతర జిల్లాలతో పాటు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు.
కరోనా రెండోదశ వ్యాప్తి చెందుతున్న సమయంలో అధికారులు కనీస చర్యలు చేపట్టకుండా... సంత నిర్వహించడం వలన కొవిడ్ వ్యాప్తి చెందే పరిస్థితి నెలకొంది. వ్యాపారులంతా ఒక చోటుకు చేరి విక్రయాలు నిర్వహిస్తున్న తీరుపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు.