క్వారంటైన్ కేంద్రంలో మిగిలిన నిత్యావసరాలను పేదలకు పంపిణీ చేయాలన్న ప్రయత్నం ప్రహసనంగా మారింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట గురుకుల పాఠశాలలోని క్వారంటైన్ కేంద్రం తొలగించి... అక్కడ మిగిలిన బియ్యం, సరుకులు పేదలకు సరఫరా చేసే పనిని అంగన్వాడీలకు అప్పగించ్చారు. పెద్దరామాలయంలో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమంలో వార్డుకి ఇద్దరు పేదలను ఎంపిక చేసి సరుకు సరఫరాకు ప్రయత్నించారు. దీంతో మేమూ పేదలమే అంటూ స్థానికులు పెద్ద ఎత్తున గూమికూడారు. పరిమితమైన సరుకులు ఎవరికి పంచాలో తెలియక సిబ్బంది ఇరకాటంలో పడ్డారు. పంపిణీ నిలిపి... అధికారులకు సమాచారం అందించారు. 15 రోజుల క్రితం వరకు రెడ్‌జోన్‌గా ఉన్న పట్టణంలో ఇప్పుడు ఇలా భౌతిక దూరం లేకుండా ప్రజలు గూమికూడటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెడ్‌జోన్ ఎత్తేస్తే... నిబంధనలు గాలికొదిలేస్తారా? - jaggayaypeta recent news
క్వారంటైన్ కేంద్రంలో మిగిలిన నిత్యావసరాల కోసం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటవాసులు ఎగబడ్డారు. కరోనా వ్యాప్తి చెందుతున్న భయం లేకుండా... సామాజిక దూరం పాటించకుండా... నిత్యవసర సరుకుల కోసం గూమికూడారు.
జగ్గయ్యపేటలో భౌతికదూరం పాటించని స్థానికులు