GADAPA GADAPA : కృష్ణా జిల్లా నాగాయలంక అంబేడ్కర్ నగర్ కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు సమస్యలు స్వాగతం పలికాయి. మంచినీటి సమస్యతో ఇబ్బందిపడుతున్నామన్న ప్రజలు.. కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ గుంతల రోడ్లు ఉన్నాయని.. సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని.. ఎమ్మెల్యేకు విన్నవించారు. పారిశుద్ధ్య లేమి కారణంగా దోమలు కుడుతున్నాయని.. అనారోగ్యం బారిన పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు ఇప్పించండి అంటూ ఎమ్మెల్యేకు మొర పెట్టుకున్నారు. ఓ మహిళ సమస్యలపై ఎమ్మెల్యేను నిలదీసింది.
గడప గడపలో ఎమ్మెల్యేలకు చేదు అనుభవాలు.. సమస్యలపై నిలదీత - gadapa gadapa program in Kakinada
YSRCP GADAPA GADAPA : వైకాపా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలకు గడపగడపలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. గ్రామాల్లో తలెత్తుతున్న సమస్యలపై నాయకులకు నిలదీస్తున్నారు. తాజాగా కృష్ణా, కాకినాడ జిల్లాలోని పలువురు నాయకులను ప్రజలు ఏకిపారేస్తున్నారు.
YSRCP GADAPA GADAPA
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొడవలి గ్రామంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు నిరసన తెగ తగిలింది. కార్యక్రమం ప్రారంభంలోనే గ్రామస్థులు, నాయకులు.. ఎమ్మెల్యే వద్దకు వచ్చి అభివృద్ధి పనులపై నిలదీశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారించారు. ఆ సమయంలో అక్కడ పోలీసులు, ప్రజలకు వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇవీ చదవండి: