ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

gamecock: నందిగామలో జోరుగా కోడి పుంజుల విక్రయాలు - krishna district latest updates

gamecock: సంక్రాంతి పండగ సమీపిస్తున్న వేళ.. నందిగామలో జోరుగా కోడి పుంజుల విక్రయాలు సాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో పందెం రాయుళ్లు కోడిపుంజులను కొనుగోలు చేస్తున్నారు.

నందిగామలో జోరుగా కోడి పుంజుల విక్రయాలు
నందిగామలో జోరుగా కోడి పుంజుల విక్రయాలు

By

Published : Jan 8, 2022, 1:58 PM IST

gamecock: కృష్ణాజిల్లా నందిగామ మార్కెట్ యార్డు వద్ద.. పందెం కోడి పుంజులు విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండుగ వస్తుందంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది పందెం కోడి పందాలే. దీనికోసం పందెంరాయుళ్లు ముందుగానే అన్ని రకాల ఏర్పాట్లూ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే.. పందెం కోడి పుంజులను కొనుగోలు చేస్తున్నారు.

కచ్చితంగా పందెం కొట్టకలిగే కోడిపుంజుల కోసం.. వెతికి మరీ భారీగా ఖర్చు పెడుతున్నారు. ప్రతీ శనివారం మార్కెట్ వద్ద జీవాల సంత జరుగుతుంది. ఈ సంతలో ఇవాళ పందెం కోళ్ల సందడి నెలకొంది. కోడిపుంజుల రకాన్ని బట్టి రూ.4వేల నుంచి రూ.30 వేల వరకు వెచ్చించి మరీ కొనుగోలు చేస్తున్నారు.

దీంతో పెంపకందార్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా కోడిపందాల్లో నెగ్గాలనే ఉద్దేశంతోనే.. తాము వేలు ఖర్చుపెట్టి కోడిపుంజులు కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు పందెం రాయుళ్లు. దీంతో కొనుగోలు దారులు, అమ్మకపుదారులతో మార్కెట్ యార్డ్ వద్ద సందడి నెలకొంది.

ఇదీ చదవండి:

Family suicide at vijayawada : విజయవాడలో.. తెలంగాణ కుటుంబం ఆత్మహత్య!

ABOUT THE AUTHOR

...view details