కృష్ణా జిల్లా నందిగామ కావేరి రెస్టారెంట్లో ఉద్రిక్తత నెలకొంది. సప్లై చేసే వ్యక్తి జేబులో ఉన్న పర్సును తీయటానికి న్యాయవాది కోట రాజు ప్రయత్నించడంతో వివాదం తలెత్తింది. దీంతో కోటరాజుకు సప్లయర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే సప్లయర్‌పై కోటరాజుకు చెందిన మరికొంత మంది వ్యక్తులు దాడి చేశారు.
సప్లై బాయ్‌తో కస్టమర్ ఘర్షణ.. రెస్టారెంట్లో ఉద్రిక్తత - నందిగామ కావేరి రెస్టారెంట్లో గొడవ
కృష్ణా జిల్లా నందిగామ కావేరి రెస్టారెంట్లో సిబ్బందికి, కస్టమర్లకు మధ్య జరిగిన ఘర్షణ.. పరస్పర దాడికి దారి తీసింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కృష్ణా జిల్లా నందిగామ కావేరి రెస్టారెంట్ పై దాడి
హోటల్ నిర్వహకులు సైతం ప్రతిదాడి చేయడంతో.... ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెస్టారెంట్ నిర్వాహకులు, సప్లయర్‌పై... న్యాయవాది కోటరాజు నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి:చెవిరెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు..: ఎమ్మెల్సీ అశోక్ బాబు
Last Updated : Jan 27, 2021, 4:44 PM IST