లాక్డౌన్ నేపథ్యంలో బంద్ అయిన మద్యం దుకాణాలు... నేడు గ్రీన్ జోన్ల పరిధిలో తెరుచుకున్నాయి. మద్యం ప్రియులు మందు షాపుల వద్ద బారులు తీరారు.
కృష్ణా జిల్లా చందర్లపాడులో ఓషాపు వద్ద జనం సుమారు కిలోమీటరు వరకు క్యూలో నిలబడ్డారు. భౌతికదూరం పాటించకుండా, ఎండను లేక్కచేయకుండా మద్యం కోసం వేచి చూస్తున్నారు.