Narla Tatarao Thermal Power Station: విజయవాడకు కూతవేటు దూరంలో ఉన్న నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే బూడిదను ఇతర ప్రాంతాలకు తరలించే క్రమంలో పాటించాల్సిన కనీస నియమాలు పాటించకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఓపెన్ ట్రక్కుల్లో బూడిదను తరలించటంతో.. చుట్టుపక్కల గ్రామాలు దుమ్ము మయమవుతున్నాయి. పరిమితిని మించి పరిశ్రమ నుంచి బూడిదను తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమస్యపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బూడిద ట్రిప్పర్‌ల నుంచి వస్తున్న దుమ్ముతో.. ప్రమాదాల బారీన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏదైనా చిన్న జ్వరంకానీ రోగం కానీ వచ్చినా డాక్టర్‌కు చూపించుకోలేని పరిస్థితి మాది.. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మాకు, ఈరోజున ప్రభుత్వం చేస్తున్నటువంటి శాపం ఎంటంటే.. లారీల నుంచి బూడిదను తీసుకొచ్చి మా ఇళ్లపై చిమ్నుతున్నారు.. సురేష్ స్ధానికుడు